logo

రామోజీరావు సేవలు చిరస్మరణీయం

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని కౌతాళం మండలం, కుంబళనూరు ఉషోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్‌ కొనియాడారు.

Updated : 16 Jun 2024 05:38 IST

కుంబళనూరు: నివాళులర్పిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు  

మంత్రాలయం గ్రామీణం (కౌతాళం), న్యూస్‌టుడే: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని కౌతాళం మండలం, కుంబళనూరు ఉషోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్‌ కొనియాడారు. కుంబళనూరు పాఠశాలలో రామోజీ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు శనివారం నివాళులర్పించారు. తేట తెలుగు అక్షర సత్యానికి నిలువుటద్దంలా ఈనాడు పత్రికను అచ్చ తెలుగులో ముద్రిస్తున్నారని తెలిపారు. అక్షర సూరీడుగా పేరుగాంచిన అక్షరయోధి క్రమశిక్షణతో పాటు ఎన్నో సామాజిక సేవలందించారని గుర్తు చేశారు.  2011-12లో అన్ని సౌకర్యాలతో సుమారు రూ.70 లక్షలతో ఈ ఉషోదయ పాఠశాలను నిర్మించారని తెలిపారు. పాఠశాలలో 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని