logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ద్విచక్రవాహనాన్ని కంటైనర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది

Updated : 16 Jun 2024 06:02 IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కంటైనర్‌

      శివ, గురుస్వామి       (పాత చిత్రాలు)  

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ద్విచక్రవాహనాన్ని కంటైనర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గుడేకల్‌కు చెందిన ఇంటర్‌ చదువుతున్న శివ (17), అతడి బంధువైన నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన గురుస్వామి (17)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కంటైనర్‌ వాహనం ఢీకొని ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గురుస్వామి కాళ్లు, మొండెం వేర్వేరుగా రహదారిపై పడ్డాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్‌ కొంతసేపు స్తంభించిపోయింది. పట్టణ ఎస్సై రమేశ్‌బాబు సిబ్బందితో ఘటనా ప్రదేశానికి వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు