logo

మంత్రులను కలిసేందుకు అధికారుల ఆసక్తి

ఉమ్మడి కర్నూలు జిల్లాకు నియమితులైన ముగ్గురు మంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి అభినందనలు తెలియజేసేందుకు జిల్లా అధికారులు వరుస కడుతున్నారు.

Published : 17 Jun 2024 02:21 IST

మంత్రి బీసీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాకు నియమితులైన ముగ్గురు మంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి అభినందనలు తెలియజేసేందుకు జిల్లా అధికారులు వరుస కడుతున్నారు. రెండు రోజులుగా అధికారులు, తెదేపా శ్రేణులతో మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు రద్దీగా మారాయి. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో మరింత రద్దీ పెరిగింది. జిల్లాకు తొలిసారిగా వచ్చిన కొత్త మంత్రులను వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలిసి అభినందనలు చెబుతున్నారు. కొందరు అధికారులు తమ స్థానాలు పదిలం చేసుకునేందుకు కూడా పరోక్షంగా సంప్రదిస్తున్నారు. 

బదిలీలకు విన్నపాలు

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పలువురు ఆదివారం మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఫరూక్‌లను కలిసి అభినందనలు తెలిపారు. తమ పూర్వ పరిచయం, అనుబంధాలను గుర్తు చేసుకుని, దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా ఇక్కడే ఉండే విధంగా సడలింపు ఇవ్వాలని కొందరు అధికారులు మంత్రులను కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ఇన్‌ఛార్జి అధికారులుగా కొనసాగుతున్న అధికారులు కూడా తమ స్థానాలు తిరిగి ఇక్కడే ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు.

ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి ఆదివారం మంత్రి ఫరూక్, బీసీ జనార్ధన్‌రెడ్డిలను కలిసి అభినందనలు తెలిపారు. ఆయన వెంట డీఈఈలు సుబ్రహ్మణ్యంరెడ్డి, రఘురామిరెడ్డి ఉన్నారు. అలాగే మంత్రి టీజీ భరత్‌ను జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఉప సీఈవో సుబ్బారెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. ఈ నెలలో నిర్వహించే జడ్పీ సర్వసభ్య సమావేశం తేదీని ఖరారు చేసి సమాచారం ఇస్తామని పేర్కొన్నారు.

బీసీ జనార్ధన్‌రెడ్డిని కలిసిన తెదేపా కర్నూలు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు

మంత్రిని కలిసిన తెదేపా నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డిని ఆదివారం బనగానపల్లిలోని ఆయన నివాసంలో కర్నూలు పార్లమెంట్‌ తెదేపా బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, తెదేపా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు తెదేపా నాయకులు మహర్షి రమణ, వాల్మీకి వెంకటయ్య నాయుడు పాల్గొన్నారు.

బీసీ జనార్ధన్‌రెడ్డిని కలిసిన తెదేపా కర్నూలు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు

మంత్రి టీజీని..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ను ఆదివారం  డీఆర్వో మధుసూదన్‌రావు, సీసీఎఫ్‌ పి.రామకృష్ణ, విశ్రాంత డీఎస్పీ మహబుబ్‌ బాషా, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, రాగమయూరి బిల్డర్స్‌ అధినేత కేజే రెడ్డి, మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, తెదేపా నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ, పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
్ఝ సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన జిల్లా దూదేకుల సంఘానికి అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం మంత్రిని జిల్లా దూదేకుల సంక్షేమ సంఘం నేతలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు, విశ్రాంత డీఎస్పీ మహబుబ్‌ బాషా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలీ, జిల్లా కార్యదర్శి సిద్ధయ్య పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని