logo

బక్రీద్‌కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

బక్రీద్‌ పండగను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ తెలిపారు. ఆదివారం ఆయన కర్నూలు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌తోపాటు జొహరాపురం, పూలబజారు, గుత్తి పెట్రోలు బంకు, సంతోష్‌నగర్‌ ఈద్గా, పంచలింగాల చెక్‌పోస్టు సందర్శించి తనిఖీ చేశారు.

Published : 17 Jun 2024 02:25 IST

సంతోష్‌ నగర్‌ ఈద్గా వద్ద జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: బక్రీద్‌ పండగను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ తెలిపారు. ఆదివారం ఆయన కర్నూలు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌తోపాటు జొహరాపురం, పూలబజారు, గుత్తి పెట్రోలు బంకు, సంతోష్‌నగర్‌ ఈద్గా, పంచలింగాల చెక్‌పోస్టు సందర్శించి తనిఖీ చేశారు. ట్రాఫిక్‌ అంతరాయ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.  ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ విజయశేఖర్, సీఐలు నాగరాజుయాదవ్, ప్రసాద్, పవన్‌కుమార్, శంకరయ్య, గౌతమి, ఎస్సై ఖాజావలి పాల్గొన్నారు.

నేడు నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: బక్రీద్‌ ను పురస్కరించుకుని సోమవారం ఉదయం కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు సీఐ గౌతమి తెలిపారు. నంద్యాల, ఆత్మకూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మద్దూర్‌నగర్‌ మసీదు-బిర్లా కాంపౌండ్‌-గుత్తి పెట్రోల్‌ బంకు-కల్లూరు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు చేరుకోవాలన్నారు. అనంతపురం వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా గుత్తి పెట్రోలు బంకు-కల్లూరు-బళ్లారి చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండు చేరుకోవాలన్నారు. హైదరాబాద్‌ వైపు నుంచి కర్నూలుకు వచ్చే బస్సులను మామిదాలపాడు వై జంక్షన్‌ వైపు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రార్థనలు ముగిసే వరకు ట్రాఫిక్‌ మళ్లిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని