logo

చిరుత తిరుగుతోంది...జాగ్రత్త!

చిరుతపులి తిరుగుతోంది...భక్తులూ... జాగ్రత్త అంటూ  దేవస్థానం అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. మహానంది క్షేత్రాన్ని చిరుతపులి వదిలి వెళ్లలేదని, మూడు రోజులుగా సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

Published : 18 Jun 2024 01:38 IST

మహానంది, న్యూస్‌టుడే: చిరుతపులి తిరుగుతోంది...భక్తులూ... జాగ్రత్త అంటూ  దేవస్థానం అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. మహానంది క్షేత్రాన్ని చిరుతపులి వదిలి వెళ్లలేదని, మూడు రోజులుగా సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం దేవస్థానం నిత్యాన్నదాన సత్రం పరిసరాల్లో ఎంగిలి విస్తరాకుల్లోని అన్నాన్ని తింటున్న కుక్కను చిరుత అమాంతంగా ఎత్తుకెళ్లినట్లుగా చెబుతున్నారు. రాత్రి విద్యుత్తు ఉపకేంద్రం పరిసరాల్లోని పొదల్లో పందులను వేటాడినట్లు చెప్పారు.ఇది నిత్యం తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. కొందరు ద్విచక్రవాహనాల లైట్లు వెలిగించి, కేకలు వేస్తూ చిరుతను తరమడానికి ప్రయత్నించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారి దినేష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి మహానందిలోని విద్యుత్తు ఉపకేంద్రం పరిసరాల్లో చిరుతపులి సంచరించినట్లు తెలియడంతో ఆదివారం ఎఫ్‌బీవో ప్రతాప్‌తోపాటు సిబ్బంది పాదముద్రలను సేకరించారు. చిరుతను బంధించాలని దేవస్థానం అధికారులు, సిబ్బందితోపాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అటవీశాఖాధికారులకు విన్నవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని