logo

అయిదింటిపై సంతకాలు హర్షణీయం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

Published : 18 Jun 2024 01:41 IST

సీఎం చంద్రబాబునాయుడుతో మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన అయిదింటిపై సంతకాలు చేయడం హర్షణీయమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకాలు చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని