logo

శ్రీగిరిలో భక్తిపారవశ్యం

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం భక్తిపారవశ్యంతో సందడిగా మారింది. శివునికి  ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు.

Published : 18 Jun 2024 01:48 IST

స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం భక్తిపారవశ్యంతో సందడిగా మారింది. శివునికి  ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనానికి బారులుతీరారు. ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఉచిత, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి ఆరు గంటలు, శీఘ్ర దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తులు నిత్యాన్నపూర్ణభవన్‌లో అన్నప్రసాదాన్ని సీˆ్వకరించారు. స్థానిక దుకాణాల్లో భక్తుల రద్దీ కనిపించింది.శ్రీశైలానికి వచ్చి, వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి.


వైభవంగా మల్లన్నకు వెండి రథోత్సవం

స్వామిఅమ్మవార్లకు పూజలు చేస్తున్న ఈవో, అర్చకులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు వైభవంగా వెండి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు సహస్రదీపాలంకరణసేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు మంగళహారతులతో పూజించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల వెండి రథోత్సవం జరిపారు. పూజల్లో ఈవో డి.పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని