logo

శ్రీమఠంలో యజ్ఞశాల

బెంగళూరుకు చెందిన దాత కెఎం.నాగరాజు అందజేసిన రూ.1.50 కోట్ల విరాళంతో శ్రీమఠంలో యజ్ఞశాల పునర్మిర్మాణానికి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు సోమవారం భూమిపూజ చేశారు.

Published : 18 Jun 2024 02:04 IST

రూ.1.50 కోట్లతో నిర్మాణం

యజ్ఞశాల పునర్మిర్మాణానికి భూమి పూజ చేస్తున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు

మంత్రాలయం, న్యూస్‌టుడే: బెంగళూరుకు చెందిన దాత కెఎం.నాగరాజు అందజేసిన రూ.1.50 కోట్ల విరాళంతో శ్రీమఠంలో యజ్ఞశాల పునర్మిర్మాణానికి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు సోమవారం భూమిపూజ చేశారు. మఠంలో పూర్వ పీఠాధిపతుల బృందావనానికి అభిముఖంగా ఉన్న యజ్ఞశాల స్థానంలో నవీన పద్ధతిలో రెండస్తుల్లో యజ్ఞశాలను పునర్మిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు మఠం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సురేశ్‌ కోణాపూర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని