logo

బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల

ఆర్టీసీ సంస్థ  విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు వెళ్లడానికి నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్‌లగ్జరీ బస్సు సర్వీసులను డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి,

Published : 19 Jun 2024 02:16 IST

తిరుపతి సూపర్‌లగ్జరీ బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి 

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే : ఆర్టీసీ సంస్థ  విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు వెళ్లడానికి నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్‌లగ్జరీ బస్సు సర్వీసులను డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి, డిపో మేనేజర్‌ శశిభూషణ్‌  మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి, బెంగళూరు, వంటి దూర ప్రాంతాలకు స్లీపర్‌ కోచ్‌లను నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. అనంతరం బస్సులో కూర్చొని  స్థానిక పాతబస్టాండుకు, అక్కడి నుంచి డిపోకు ప్రయాణించారు. కార్యక్రమంలో ఏఎంఎఫ్‌ పుల్లయ్య, టీఐ-2 మోజెస్, ఎస్డీఐ గోపాల్‌గౌడ్, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ హరికిషన్, మాజీ వైస్‌ ఛైర్మన్‌ టీఈ కేశన్నగౌడ్, సర్పంచి అర్జున్‌రెడ్డి, తెదేపా నాయకులు ఆర్టీసీ ఎన్‌ఎంఎయూ, ఈయూ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు