logo

న్యాయం జరిగే వరకు పోరాటం : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 19 Jun 2024 02:25 IST

సంగమేశ్వరంలో బైరెడ్డితో మాట్లాడుతున్న పోలీసులు

కొత్తపల్లి, న్యూస్‌టుడే : శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామంలో భూ సమస్యతో బీడుగా మారిన భూముల్లో మొక్కలు తొలగిస్తున్న స్థానికులకు మంగళవారం ఆయన మద్దతు తెలుపేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో సంగమేశ్వరంలో బైరెడ్డి పూజలు చేస్తుండగా ఆత్మకూరు సీఐ నాగభూషన్, కొత్తపల్లి ఎస్సై హరిప్రసాద్, పాములపాడు ఎస్సై అశోక్‌ వచ్చి ఆ భూముల్లో 145 సెక్షన్‌ అమల్లో ఉందని గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి అక్కడే విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పేదలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జానాలగూడెం, బలపాలతిప్ప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని