logo

మార్కెట్‌ యార్డును ప్రథమ స్థానంలో నిలబెడతాం: బీవీ

Published : 19 Jun 2024 03:05 IST

సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: వైకాపా ఐదేళ్ల పాలనలో మార్కెట్‌ యార్డును నిర్వీర్యం చేశారని, తమ ప్రభుత్వం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్‌ అధికారి, సిబ్బందితో యార్డు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ.. గతంలో తెదేపా హయాంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేశామని, పత్తి కొనుగోలు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో మంచి ధరకు విక్రయించేందుకు సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తానన్నారు. మార్కెట్‌ పరిధిలో మిర్చి సాగు అధికంగా జరుగుతున్నందున శీతల గోదాముల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. యార్డులో వరి ధాన్యం నిల్వ కొనుగోలు జరిగేలా సమీక్షిస్తామన్నారు. తమ హయాంలో మార్కెట్‌ అభివృద్ధికి రూ.5 కోట్ల తెస్తే వాటిని వినియోగించలేకపోయారని విమర్శించారు. సమావేశంలో కార్యదర్శి పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు