logo

కీబోర్డు.. రఫెల్‌ జోరు

ఆ విద్యార్థి వేళ్లు కీబోర్డుపై నృత్యం చేస్తాయి. వాయిద్యం విభిన్నమైన రాగాలు వినిపిస్తుంది. సంగీతంపై పట్టుసాధించాలంటే ఏకాగ్రత.. విజయం పొందాలంటే సాధన అవసరమని నిరూపించాడు ఆదోని పట్టణానికి చెందిన కీబోర్డు

Published : 19 Jun 2024 03:12 IST

న్యూస్‌టుడే, ఆదోని సాంస్కృతికం

కీబోర్డు వాయిస్తున్న రఫెల్‌ విక్లిప్‌

విద్యార్థి వేళ్లు కీబోర్డుపై నృత్యం చేస్తాయి. వాయిద్యం విభిన్నమైన రాగాలు వినిపిస్తుంది. సంగీతంపై పట్టుసాధించాలంటే ఏకాగ్రత.. విజయం పొందాలంటే సాధన అవసరమని నిరూపించాడు ఆదోని పట్టణానికి చెందిన కీబోర్డు  కళాకారుడు రఫెల్‌ విక్లిప్‌. ఇటీవల విజయవాడకు చెందిన హలేల్‌ మ్యూజిల్‌ స్కూల్, దండింగి అగస్టిన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కీబోర్డు సంగీత పోటీల్లో ప్రతిభ చాటి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 

ఆన్‌లైన్‌లో శిక్షణ 

సాధించిన పతకం, ధ్రువపత్రం చూపుతూ..  

ఆదోని పట్టణానికి చెందిన ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకుడు జోనాథన్‌ విక్లిప్, సంధ్యారాణి దంపతుల కుమారుడు రఫెల్‌ విక్లిప్‌ పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఓ వైపు చదువుతూనే.. మరోవైపు సంగీతంపై ఆసక్తితో కీబోర్డు సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆన్‌లైన్‌ ద్వారా కీబోర్డు వాయిద్యం ప్లే చేయడంలో మెలకువలు నేర్చుకుంటూ సాధన చేశాడు. నెమ్మదిగా కీబోర్డుపై పట్టు సాధించారు. చిన్న చిన్న కార్యక్రమాల్లో కీబోర్డు వాయిస్తూ ప్రతిభ చాటడంతో పలువురు చేత శభాష్‌ అనిపించుకున్నాడు. ఇటీవల విజయవాడకు చెందిన హలేల్‌ మ్యూజిల్‌ స్కూల్‌లో  నిర్వహించిన ఇంజినియస్‌ ఛాంప్‌ వరల్డ్‌ రికార్డు పోటీల్లో పాల్గొని రఫెల్‌ విక్లిప్‌ బంగారు పతకంతో పాటు బ్యాడ్జి, ధ్రువపత్రం అందుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే చదువుతో పాటు సంగీతంలో రాణిస్తున్నానని.. చదువు, సంగీతంలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతున్నాడు విద్యార్థి రఫెల్‌ విక్లిప్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు