logo

సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి

సాగునీటి విడుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జలాశయాలు, కాల్వల్లో మరమ్మతులు, నిర్వహణ పనులు వెంటనే చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది.

Published : 20 Jun 2024 03:10 IST

అత్యవసర పనులకు ప్రతిపాదనలు  

కర్నూలులో ఇరిగేషన్‌ ఇంజినీర్లతో చర్చిస్తున్న సీఈ కబీర్‌ బాషా 

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: సాగునీటి విడుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జలాశయాలు, కాల్వల్లో మరమ్మతులు, నిర్వహణ పనులు వెంటనే చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కర్నూలు సీఈ కబీర్‌ బాషా బుధవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని సర్కిల్, డివిజన్‌ ఇంజినీర్లతో అత్యవసరం సమావేశం నిర్వహించారు. ఏయే ప్రాజెక్టుకు ఎక్కడెక్కడ ఎన్ని నిధులు అవసరం, ఏయే పనులు అత్యవసరంగా నిర్వహించాలి అనే అంశాలపై ఇంజినీర్లతో సమగ్రంగా చర్చించారు. వరదలు, వర్షాకాలం రాకముందే కాల్వలు, జలాశయాల వద్ద కనీస నిర్వహణ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) పనులు నిర్వహించాలని సీఈ ఆదేశించారు. 

  •  తెలుగు గంగ, ఎస్సార్బీసీ, ఎల్లెల్సీ, కేసీ కాల్వ, గురురాఘవేంద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి అత్యవసర నిర్వహణ పనులకు రు.70 కోట్ల వరకు ప్రతిపాదలు అందాయని, వీటిని ప్రభుత్వానికి పంపుతామని సీఈ పేర్కొన్నారు. 
  •  గాజులదిన్నె ప్రాజెక్టుకు రూ.9.50 కోట్లు, ఎల్లెల్సీకి రూ.13 కోట్లు, కేసీ కాల్వతోపాటు సుంకేసుల జలాశయానికి రూ.8.59 కోట్లు, ఎస్సార్బీసీ ప్రాజెక్టుకు రూ.12 కోట్లు, తెలుగుగంగకు రూ.17 కోట్లు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి రూ.2 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు రూ.1.50 కోట్లు, గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.4 కోట్లు ఇతరత్రా రూ.2.41 కోట్లు అవసరమని తాత్కాలికంగా నిర్ణయించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని