logo

వైకాపా నాయకుల ఒత్తిడితో రాజీనామా చేశాం

సార్వత్రిక ఎన్నికల ముందు వైకాపా నాయకులు తమచేత బలవంతంగా రాజీనామా చేయించారని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 20 Jun 2024 06:44 IST

ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రాజీనామా చేసిన వాలంటీర్లు
ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ముందు వైకాపా నాయకులు తమచేత బలవంతంగా రాజీనామా చేయించారని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బుధవారం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాలంటీర్లుగా తమకు ఇస్తున్న గౌరవ వేతనంతో కుటుంబ జీవనం సాగుతోందన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందించి న్యాయం చేయాలన్నారు. అనంతరం ఆదోని సబ్‌కలెక్టర్‌ శివ్‌నారాయణ శర్మకు వారు వినతి పత్రం అందజేశారు. వాలంటీర్లు వీరేశ్, షాకీరా సుల్తానా, మంగమ్మ, రవికుమార్, సతీశ్, హరికా, సబితా, మహేశ్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని