logo

అటువైపు ప్రోత్సాహం.. ఇటువైపు నిర్లక్ష్యం

సప్తనదీ సంగమేశ్వర ఆలయం సమీపంలో కృష్ణా నది పరివాహక ప్రాంతం ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. అటు వైపు తెలంగాణ రాష్ట్రం, ఇవతల నంద్యాల జిల్లా సంగమేశ్వరుడు కొలువైన ప్రాంతం.. ఎత్తయిన నల్లమల కొండల నడుమ నది పరవళ్లు తొక్కుతున్న ప్రాంతం కావడంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Published : 20 Jun 2024 03:46 IST

 సోమశిల ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసిన పర్యాటక వసతి కేంద్రాలు 

సప్తనదీ సంగమేశ్వర ఆలయం సమీపంలో కృష్ణా నది పరివాహక ప్రాంతం ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. అటు వైపు తెలంగాణ రాష్ట్రం, ఇవతల నంద్యాల జిల్లా సంగమేశ్వరుడు కొలువైన ప్రాంతం.. ఎత్తయిన నల్లమల కొండల నడుమ నది పరవళ్లు తొక్కుతున్న ప్రాంతం కావడంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నది ఒడ్డున పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత వసతి గృహాలు ఏర్పాటు చేశారు. పర్యాటకులు నదిలో నల్లమల అందాలను వీక్షించేందుకు బోట్లను ఏర్పాటు చేశారు. ఇటువైపు కూడా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సమయంలో సంగమేశ్వరాలయం చెంత పర్యాటక హోటల్‌ను నిర్మించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఇక్కడి పర్యాటక భవనం శిథిలావస్థకు చేరుకుంది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పర్యాటకులు ఆకాంక్షిస్తున్నారు.  

- ఈనాడు, కర్నూలు 

 సంగమేశ్వరాలయం వద్ద హోటల్‌ శిథిలావస్థకు చేరిందిలా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని