logo

కార్డుదారులకు తీపి కబురు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఐదు హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు.

Published : 21 Jun 2024 03:06 IST

వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీకి ఏర్పాట్లు 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఐదు హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. తాజాగా పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గడిచిన రెండేళ్లలో రేషన్‌ కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేయలేదు. గత ఆరేడు నెలలుగా కందిపప్పు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు ధర రూ.150కుపైగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి రేషన్‌ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫలితంగా పేద కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చౌక దుకాణాల నుంచి పేదలకు బియ్యం, కందిబేడలు, చక్కెరతోపాటు నిత్యావసర సరకులు లభించేవి. వైకాపా ప్రభుత్వంలో కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని