logo

వరద.. గేట్లకు బెడద

కొన్ని నెలలుగా అడుగంటిన సుంకేసుల జలాశయానికి ఇటీవల తుంగభద్ర నది ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో వరద నీరు చేరి జలకళను సంతరించుకుంటోంది.

Published : 21 Jun 2024 03:11 IST

సుంకేసుల జలాశయం నుంచి వృథాగా నీరు

13వ గేటు నుంచి వృథాగా పోతున్న నీరు 

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: కొన్ని నెలలుగా అడుగంటిన సుంకేసుల జలాశయానికి ఇటీవల తుంగభద్ర నది ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో వరద నీరు చేరి జలకళను సంతరించుకుంటోంది.  టీబీ డ్యాం నుంచీ విడుదల చేసే అవకాశాలున్నాయి. దీంతో జలాశయానికి మరింత వరద చేరుకుంటుంది. జలాశయ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో 1.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి వరద నీటి ఇన్‌ఫ్లో 3,672 క్యూసెక్కుల చొప్పున చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు.

 వరద నీరు చేరడంతో నిండుకుండలా సుంకేసుల జలాశయం

భద్రత ప్రశ్నార్థకం 

సుంకేసుల జలాశయంలో మొత్తం 30 క్రస్ట్‌ గేట్లు ఉన్నాయి. వీటిలో 29 గేట్లు పని చేస్తున్నాయి. జలాశయంలోకి ఇటీవల కాలంలో వరద నీటి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో గేట్ల పనితీరుపై సంబంధిత అధికారులు శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ఉంది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు కావడంతో మిగులు జలాలను తుంగభద్ర నది దిగువకు గేట్లు ఎత్తి విడుదల చేస్తారు. ఇప్పటికే జలాశయం నీటి నిల్వ 1.15 టీఎంసీలకు చేరుకుంది. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే జలాశయంలో మొత్తం గేట్లలో సగానికిపైగా గేట్ల నుంచి నీరు లీకేజీ రూపంలో వృథాగా పోతోంది. 3, 6, 8, 12, 13, 14, 16, 18, 19, 21, 27 గేట్ల ద్వారా నీరంతా దిగువకు గేట్లు ఎత్తుకుండానే వృథాగా పోతోంది. ఇందులో కొన్ని గేట్లు తుప్పు పట్టి పోయాయి. గతంలో సుంకేసుల జలాశయానికి ఎగువ టీబీ డ్యాం నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో జలాశయ ఉన్నతాధికారులు గేట్ల భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు