logo

నాటి కర్నూలు ఏఎస్పీ.. నేడు డీజీపీ

డీజీపీగా నియమితులైన ద్వారకా తిరుమలరావుకు కర్నూలు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌కు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన పోలీసు జీవిత ప్రస్థానం కర్నూలు జిల్లా నుంచే ప్రారంభమైంది.

Published : 21 Jun 2024 03:33 IST

2021 జులై 13న కర్నూలు ఆర్టీసీ బస్టాండులో ద్వారకా తిరుమలరావు

డీజీపీగా నియమితులైన ద్వారకా తిరుమలరావుకు కర్నూలు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌కు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన పోలీసు జీవిత ప్రస్థానం కర్నూలు జిల్లా నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటగా కర్నూలు ఏఎస్పీగా నియమితులయ్యారు. 1991, నవంబరు 20వ తేదీ నుంచి 1992, జూన్‌ 24 వరకు పనిచేశారు. అనంతరం కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సందర్భంలోనూ 2021, జులై 13న కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండులను సందర్శించారు. డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.  

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని