logo

పురపాలిక చేజిక్కించుకునేందుకు తెదేపా వ్యూహాలు

ఆళ్లగడ్డ పురపాలికను చేజిక్కించుకునేందుకు తెదేపా నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా గురువారం కీలక పరిణామం చోటుచేసుకొంది.

Published : 21 Jun 2024 04:14 IST

ఇప్పటికే సైకిలెక్కిన ముగ్గురు కౌన్సిలర్లు
మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఇంకొందరు

వైకాపా నుంచి తెదేపాలో చేరిన కౌన్సిలర్లు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ పురపాలికను చేజిక్కించుకునేందుకు తెదేపా నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా గురువారం కీలక పరిణామం చోటుచేసుకొంది. వైకాపాకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తెదేపా నేత భార్గవ్‌ రామ్‌నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. 13వ వార్డు కౌన్సిలరు మునగాల మల్లేశ్వరి, 26వ వార్డు కౌన్సిలరు మహబూబ్‌ బాషా తెదేపా కండువా కప్పుకొన్నారు. మరో వైకాపా కౌన్సిలరు భూమా అఖిలప్రియను కలిసి సంఘీభావం తెలిపారు. ఆళ్లగడ్డ పురపాలికలో మొత్తం 27 వార్డులు ఉన్నాయి. 22 వార్డులు వైకాపా దక్కించుకోగా, మూడు వార్డుల్లో తెదేపా, రెండు వార్డుల్లో భాజపాకు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. పడకండ్లకు చెందిన రెండో వార్డు కౌన్సిలరు బద్రి సుధామణి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఇంకొందరు కౌన్సిలర్లు ఇప్పటికే తెదేపా నాయకులతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వారు రాబోయే కొన్ని రోజుల్లో అధికారికంగా తెదేపా కండువా కప్పుకోనున్నారని సమాచారం. మరో వైకాపా కౌన్సిలరు ఇప్పటికే అనధికారికంగా తెదేపా నాయకులతో కలిసి తిరుగుతున్నారు. అవసరమైన పక్షంలో తాను తెదేపాకు మద్దతిస్తానని చెప్పడం గమనార్హం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు