logo

ఆసనాలతో ఉపయోగాలెన్నో

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల యోగాసనాలు వేశారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వక్తలు తెలిపారు.

Published : 22 Jun 2024 02:54 IST

నంద్యాల పట్టణంలో యోగాసనాలు వేస్తున్న నంద్యాల కేజీబీవీ మైనార్టీ విద్యార్థిని

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల యోగాసనాలు వేశారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వక్తలు తెలిపారు. శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరం కావొచ్చునని నంద్యాల పట్టణంలో ఇండోర్‌స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి వాటి ప్రాముఖ్యాన్ని ఆనంద్‌ గురూజీ తెలియజేశారు. వైఎస్సార్‌ నగర్‌లో ఉన్న కేజీబీవీ మైనార్టీ విద్యార్థులు వివిధ యోగాసనాలతో అందర్నీ అలరించారు. ఆసనాలు వేసిన విద్యార్థులను విద్యాలయ ప్రత్యేక అధికారిణి హెప్సిబా బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.

న్యూస్‌టుడే బృందం


నంద్యాలలోని ఇండోర్‌ స్టేడియంలో యోగాసనం వేస్తున్న కలెక్టర్‌ శ్రీనివాసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని