logo

స్ఫూర్తి ప్రదాత రామోజీ

నేటి యువ పాత్రికేయులు రామోజీరావును స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ అన్నారు.

Published : 22 Jun 2024 02:58 IST

రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కేఈ ప్రభాకర్‌

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : నేటి యువ పాత్రికేయులు రామోజీరావును స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ అన్నారు. నగరంలోని సమాచార పౌర సంబంధాల కార్యాలయం వద్దనున్న మీడియా రూమ్‌లో ఫొటో, వీడియో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో రామోజీరావు సంతాప సభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, సంఘం నాయకులు రామకృష్ణ, చెన్నయ్య, రామన్న, అనిల్, శ్రీనివాసులు, మురళీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిజానికి దిక్సూచి రామోజీరావు అని వక్తలు పేర్కొన్నారు. ప్రజల పక్షాన వార్తలు అందించి ‘ఈనాడు’ సంస్థ ముందు వరసలో నిలపడంలో ఆయన కృషి ఎనలేనిదని చెప్పారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం కావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని