logo

సరిహద్దుల్లో ఇసుక రగడ

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామ ప్రాంతవాసులు ఆంధ్రా పరిధిలో ఇసుక తవ్వకాలు జరుపుతూ గత కొంతకాలంగా అక్రమ రవాణా చేస్తున్నారు.

Published : 22 Jun 2024 03:31 IST

రాజోలి వద్ద 51 ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు

కర్నూలు సచివాలయం, కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామ ప్రాంతవాసులు ఆంధ్రా పరిధిలో ఇసుక తవ్వకాలు జరుపుతూ గత కొంతకాలంగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు శుక్రవారం జాయింట్‌ ఆపరేషన్‌ చేశారు. రాజోలి వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 51 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మైనింగ్‌ అధికారి టి.రాజశేఖర్‌ తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ల నుంచి అపరాధ రుసుము వసూలు చేసి ట్రాక్టర్లను విడుదల చేశామన్నారు. మా హద్దుల్లో ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని రాజోలి ప్రాంతవాసులు.. ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించి తవ్వకాలు జరుపుతున్నారని జిల్లా మైనింగ్‌ అధికారులు.. ఇలా ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.. ఈ తనిఖీల్లో కర్నూలు తహసీల్దారుతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని