logo

32 పనులు.. రూ.4 కోట్లతో ప్రతిపాదనలు

సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి అన్నదాతకు అండగా నిలిచేందుకు నూతన ప్రభుత్వం సిద్ధమైంది.

Published : 23 Jun 2024 03:43 IST

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే : సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి అన్నదాతకు అండగా నిలిచేందుకు నూతన ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలకు సంబంధించి అత్యవసర నిర్వహణకు రూ.70 కోట్లు అవసరమని జలవనరులశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. అత్యంత అవసరమైన పనులు, ప్రధానంగా మెకానికల్‌ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 112 పనులకు రూ.13 కోట్లతో అంచనాలు తయారుచేశారు. పనులు, నిధుల వ్యయం తగ్గించాలని ఆదేశించడంతో 32 పనులకు రూ.4 కోట్లు అవసరమంటూ కర్నూలు సీఈ కబీర్‌బాషా అమరావతిలో నివేదికలు అందజేశారు. సీఈ గత రెండు రోజులుగా అమరావతిలోనే మకాం వేసి రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించారు. మంజూరయ్యే నిధులతో తక్షణ మెకానికల్‌ పనులు చేసేందుకు అవకాశముంటుందని సీఈ ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం అంగీకరించడంతో ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో భాగంగా నిధులు విడుదల కానున్నాయి.

 జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ను కర్నూలు సీఈ కబీర్‌బాషా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, ఆయకట్టు, కొనసాగుతున్న పనులను వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని