logo

నల్లమలలో శిక్షణ ఐఏఎస్‌ల పర్యటన

2023- 24 శిక్షణ ఐఏఎస్‌ల బృందం శనివారం నల్లమలలోని బైర్లూటి ప్రాంతంలో పర్యటించారు. ఏపీ దర్శన్‌ ప్రోగ్రాం కింద నాగార్జున సాగర్‌- శ్రీశైలం పులుల అభయారణ్యంపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు శిక్షణ ఐఏఎస్‌లు సీహెచ్‌ కల్యాణి, హిమవంశి, ఎస్‌.జగన్నాథ్, వినూత్న, భావన, శభం నౌకల్‌ పర్యటించారు.

Published : 23 Jun 2024 03:47 IST

శిక్షణ ఐఏఎస్‌లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీనివాసులు, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

ఆత్మకూరు, న్యూస్‌టుడే : 2023- 24 శిక్షణ ఐఏఎస్‌ల బృందం శనివారం నల్లమలలోని బైర్లూటి ప్రాంతంలో పర్యటించారు. ఏపీ దర్శన్‌ ప్రోగ్రాం కింద నాగార్జున సాగర్‌- శ్రీశైలం పులుల అభయారణ్యంపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు శిక్షణ ఐఏఎస్‌లు సీహెచ్‌ కల్యాణి, హిమవంశి, ఎస్‌.జగన్నాథ్, వినూత్న, భావన, శభం నౌకల్‌ పర్యటించారు. ముందుగా బైర్లూటి జంగిల్‌ సఫారీ వాహనంలో నల్లమల అడవిలో పర్యటించారు. అటవీ అధికారులతో చర్చించి నల్లమలలో పులుల సంరక్షణ, వాటిని లెక్కించే విధానం, చెంచుల జీవనశైలి, వారి జీవన ప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి వివరాలు సేకరించారు. బైర్లూటి, అమలాపురం గూడేల చెంచులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి శిక్షణ బృందాన్ని కలిసి జిల్లా నైసర్గిక స్వరూపం, పరిపాలన, అటవీ విస్తీర్ణం తదితర విషయాలు వివరించారు. ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి ఐటీడీఏ పరిధిలోని జిల్లాలు, గిరిజనుల జీవన విధానం, అటవీ ఉత్పత్తులపై  వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు