logo

సాగు సమస్యలు నివృత్తి చేసుకోండి

ముందస్తు వర్షాలు కురిశాయి. ఖరీఫ్‌ కాడి కదిలింది.. విత్తనాలు మొలకెత్తాయి.. మరికొందరు నాటాల్సి ఉంది. ముందుగా వేసిన పత్తి, వేరుశనగ వంటి పంటల్లో చీడపీడల బెడద ఉంది.

Updated : 23 Jun 2024 05:55 IST

వీడియో కాల్‌ చేయొచ్చు
చీడపీడలను ప్రత్యక్షంగా వివరించొచ్చు

  • ముందస్తు వర్షాలు కురిశాయి. ఖరీఫ్‌ కాడి కదిలింది.. విత్తనాలు మొలకెత్తాయి.. మరికొందరు నాటాల్సి ఉంది. ముందుగా వేసిన పత్తి, వేరుశనగ వంటి పంటల్లో చీడపీడల బెడద ఉంది. విత్తనం అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, విత్తనశుద్ధి వంటి అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
  • ఇప్పటికే సాగు చేసిన వాణిజ్య, కూరగాయ పంటల్లో పీడిస్తున్న సమస్యలను రైతులు పొలానికి వెళ్లి నేరుగా వీడియో కాల్‌ చేసి సలహాలు తీసుకోవచ్చు.  
  • వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువులు, కోళ్లకు సీజన్‌ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు, పెంపకంలో చేపట్టాల్సిన చర్యలు తెలుసుకోవచ్చు.

రేపు ఉదయం 10 గంటలకు

 రైతులు సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 7702366115, 7032732773, 9603293514, 9346045968 చరవాణి నంబర్లకు ఫోన్‌ చేస్తే వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ శాస్త్రవేత్తలు డాక్టర్‌ అశోక్‌కుమార్, డాక్టర్‌ రమేశ్‌నాయక్, డాక్టర్‌ మౌనిక, డాక్టర్‌ నిరంజన్‌రెడ్డిలు సందేహాలు నివృత్తి చేస్తారు. వీడియో కాల్‌ కూడా చేయొచ్చు.

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని