logo

కలెక్టర్‌గా పి.రంజిత్‌బాషా

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పి.రంజిత్‌బాషా నియమితులయ్యారు. ఆయన బాపట్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై కర్నూలు కలెక్టర్‌గా రానున్నారు. బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత రెండో కలెక్టర్‌గా 2023, ఏప్రిల్‌ 10న పి.రంజిత్‌బాషా నియమితులయ్యారు.

Published : 23 Jun 2024 03:53 IST

 రంజిత్‌ బాషా, కలెక్టర్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పి.రంజిత్‌బాషా నియమితులయ్యారు. ఆయన బాపట్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై కర్నూలు కలెక్టర్‌గా రానున్నారు. బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత రెండో కలెక్టర్‌గా 2023, ఏప్రిల్‌ 10న పి.రంజిత్‌బాషా నియమితులయ్యారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. చీరాల ఐఎల్‌టీడీ అతిథిగృహంలో ఏడాదిన్నరకు పైగా తాత్కాలికంగా ఏర్పాటుచేసిన కలెక్టర్‌ క్యాంపు కార్యాలయాన్ని ఆయన హయాంలో బాపట్ల ఏజీ కళాశాల వ్యవసాయ క్షేత్రంలో నూతన భవనం నిర్మించి గత జనవరి 1న అందులోకి మార్చారు.

ఎన్టీఆర్‌ జిల్లాకు డా.సృజన

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న డా.జి.సృజన ఎన్టీఆర్‌ జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 2023, ఏప్రిల్‌ 10వ తేదీన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 14 నెలల 12 రోజులపాటు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. గతంలో ఆమె తండ్రి బలరామయ్య కర్నూలు కలెక్టర్‌గా పనిచేయగా.. ఇదే జిల్లాకు పాలనాధికారిగా ఆమె రావడం విశేషం. 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో, ఆ తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పాలనాపరంగా ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు జిల్లాలో శాంతియుత వాతావరణం కల్పించడంలో సఫలీకృతులయ్యారు. ఎన్నికల విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మంత్రాలయం ఆర్వో మురళిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన 103 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆ తర్వాత దానిని ఎత్తేశారు. శిథిలావస్థకు చేరిన కలెక్టరేట్‌ సముదాయాన్ని రూ.8 కోట్లతో ఆధునికీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని