logo

నకిలీ బంగారం పెట్టి రూ.6.66 లక్షల రుణం

నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి లక్షల రూపాయలు రుణంగా పొంది మోసగించినందుకు ఇద్దరు వ్యక్తులపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల ఎస్సై వరప్రసాద్‌ సోమవారం తెలిపారు.

Published : 25 Jun 2024 03:44 IST

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే : నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి లక్షల రూపాయలు రుణంగా పొంది మోసగించినందుకు ఇద్దరు వ్యక్తులపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల ఎస్సై వరప్రసాద్‌ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..ఉయ్యాలవాడ మండలంలోని మాయలూరు గ్రామానికి చెందిన నక్క లక్ష్మీనారాయణ గతేడాది మే 23న 4నకిలీ బంగారు గాజులు తీసుకొని కోవెలకుంట్లలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టు పెట్టి రూ.1.73లక్షలు, అదే నెల 25న మరో 4నకిలీ బంగారు గాజులు తాకట్టు పెట్టి రూ.1.90లక్షలు రుణంగా తీసుకున్నాడు. సంజామల మండలంలోని పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల అమీర్‌ గతేడాది జూలై 5న 4బంగారు గాజులు తాకట్టు పెట్టి రూ.1.83లక్షలు, అదే నెల 24న మరో నకిలీ బంగారు కడియం తాకట్టు పెట్టి రూ.1.20లక్షలు రుణంగా తీసుకున్నాడు. ఇద్దరు కలిసి నకిలీ బంగారంపై మొత్తం రూ.6.66లక్షలు రుణంగా తీసుకున్నారు. కొంతకాలానికి సంస్థ హెడ్‌ ఆఫీస్‌ నుంచి ఆడిట్‌ నిర్వహించగా ఈ తాకట్టు పెట్టినది  నకిలీ బంగారు అని, అందులో కేవలం 10శాతం మాత్రమే బంగారం ఉన్నట్లు తేలింది. ఈ ఘటనపై హెడ్‌ ఆఫీస్‌ అధికారుల ఆదేశాల మేరకు బ్రాంచి మేనేజర్‌ దూదేకుల మహబూబ్‌బాషా ఇద్దరిపై ఫిర్యాదు చేయడంతో చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 


ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వాహనం సీజ్‌

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే : ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను తీసుకొస్తున్న వాహనాన్ని తెలంగాణ- ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో సీజ్‌ చేసినట్లు శ్రీశైలం రేంజ్‌ అటవీశాఖ అధికారి నరసింహులు సోమవారం తెలిపారు. శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగంపై అటవీశాఖ అధికారులు నిషేధం విధించారని చెప్పారు. సున్నిపెంటకు చెందిన జాకీర్‌ ఓ వాహనంలో 250 కేసుల ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి తెస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు లింగాల గట్టు అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసి వాహనాన్ని సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఈమేరకు కేసు నమోదు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని