logo

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

కడుపు నొప్పి తాళలేక వివాహిత మహిళ సీతామహాలక్ష్మి(23) ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక పట్టణంలోని ఎరుకలపేటలో సోమవారం చోటు చేసుకుంది.

Published : 25 Jun 2024 03:45 IST

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే : కడుపు నొప్పి తాళలేక వివాహిత మహిళ సీతామహాలక్ష్మి(23) ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక పట్టణంలోని ఎరుకలపేటలో సోమవారం చోటు చేసుకుంది. ప్యాపిలి మండలం రంగాపురం గ్రామానికి చెందిన సీతామహాలక్ష్మిని బనగానపల్లి పట్టణంలోని ఎరుకల పేటకు చెందిన శివతో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.  ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పంకాకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లి వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, బనగానపల్లి సీఐలు సుబ్బారావు, తిమ్మారెడ్డిలు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.  మృతురాలు గర్భవతి కావడంతో పాటు ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. బనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


జలాశయం వద్ద యువకుడి మృతి

అవుకు, న్యూస్‌టుడే : అవుకు జలాశయం తూము పైనుంచి కింద పడి వ్యక్తి మరణించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుడు అవుకు ఈబీసీ కాలనీకి చెందిన బాబుప్రసాద్‌గా గుర్తించామని ఎస్సై కిరణ్‌బాబు తెలిపారు. మృతుడి తల్లి వరలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని