logo

మల్లన్న సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం దర్శించుకున్నారు.

Published : 25 Jun 2024 03:47 IST

స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం దర్శించుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, మేఘారెడ్డిలతో కలిసి భట్టి విక్రమార్క దంపతులు శ్రీశైలం చేరుకున్నారు. వారికి దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు, ప్రధానార్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. టీఎస్‌ జెన్‌కో ఆధ్వర్యంలోని భూగర్భ జల విద్యుత్తు కేంద్రాన్ని పరిశీలించి, ఉత్పత్తిపై సమీక్ష చేసేందుకు వచ్చినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని