logo

వాకింగ్‌ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ఉదయం వాకింగ్‌ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది.

Published : 25 Jun 2024 12:55 IST

బీ క్యాంపు: ఉదయం వాకింగ్‌ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముంటున్న నాయకంటి రామసుబ్బయ్య మంగళవారం ఉదయం కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ మైదానంలో వాకింగ్‌కు వెళ్లారు. వాకింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామ సుబ్బయ్య మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని