logo

Kurnool: చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐదు సంతకాలు చేయడంపై హర్షిస్తూ ఆదోని పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Published : 15 Jun 2024 17:15 IST

ఆదోని మార్కెట్: సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐదు సంతకాలు చేయడంపై హర్షిస్తూ ఆదోని పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేసేలా సంతకాలు చేయడం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడేగల్ అయ్యన్న, కర్నూలు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు శేశిరెడ్డి, ఆదోని తెలుగు రైతు అధ్యక్షుడు దిబ్బనకల్ లక్ష్మన్న, సీనియర్ నాయకులు రంగన్న చౌదరి, బుద్ధారెడ్డి, తిమ్మప్ప, రైతులు, యువకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు