logo

యోగా సాధనతో మానసిక ప్రశాంతత

జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ జి.కృష్కాంత్‌ మాట్లాడారు.

Published : 21 Jun 2024 13:54 IST

కర్నూలు నేరవార్తలు:  జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ జి.కృష్కాంత్‌ మాట్లాడారు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు మానసిక, శారీరకంగా ఉపశమనం సాధించడానికి యోగా అవసరమన్నారు. యోగా సాధనతో కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.  ఈ కార్యక్రమంలో యోగా నిపుణులు ఇంటర్ నేషనల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ  ఫారూల్ కూరానా , కర్నూలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ లంక నాగారాజు,  అదనపు ఎస్పీలు నాగరాజు, నాగబాబు, మహిళా పీయస్ డీఎస్పీ  బాబు ప్రసాద్ ,  ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు,  సీఐలు నాగరాజ్ యాదవ్,  ఇంథియాజ్ బాషా , పవన్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి , గౌతమి, ఆర్ ఐలు,  ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు