logo

పోలీస్ స్టేషన్‌లను పరిశుభ్రంగా ఉంచాలి

మండలంలో శాంతి భద్రతలు పరిరక్షించే సీఐ తన స్టేషన్‌ను పరిశుభ్రం చేయడానికి నడుం బిగించారు.

Published : 15 Jun 2024 13:18 IST

బేతంచెర్ల: మండలంలో శాంతి భద్రతలు పరిరక్షించే సీఐ తన స్టేషన్‌ను పరిశుభ్రం చేయడానికి నడుం బిగించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా గడ్డిని పెంచారు. గడ్డి పెరిగిపోవడంతో పోలీస్ సిబ్బందితో సీఐ ప్రీయతం రెడ్డి గడ్డి కోసే యంత్రంతో తొలగించే పని చేపట్టారు. తాను పోలీసు ఉన్నతాధికారి అయినప్పటికీ తోటి సిబ్బందితో కలిసి పని చేయడం పట్ల పోలీస్ స్టేషన్‌కి వచ్చిన మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు