logo

రాహుల్ గాంధీ బర్త్‌డే.. కేక్‌ కట్‌ చేసిన కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలను పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ఖాసీం వలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Published : 19 Jun 2024 12:48 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలను పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ఖాసీం వలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కేక్‌ కట్‌ చేసి రాహుల్‌గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం ఖాసీంవలి మాట్లాడుతూ ప్రస్తుతం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 240 సీట్లు రావడం హర్షణీయమన్నారు.రానున్న రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకొని 300కు పైగా సీట్లు సాధించి, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలందర్, లోకేష్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని