logo

Kurnool: విద్యుత్తు ఫీడర్‌కు మరమ్మతులు

నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ ఏపీ ట్రాన్స్‌కో 220 కేవీ సబ్ స్టేషన్‌కు ప్రధాన విద్యుత్తు సరఫరా కేంద్రంలోని ఒక లైన్ ఫీడర్‌కు మరమ్మతులు చేపడుతున్నట్లు ఈఈ ఆపరేషన్స్ రమణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 12 Jun 2024 21:43 IST

రైతునగరం (నంద్యాల): నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ ఏపీ ట్రాన్స్‌కో 220 కేవీ సబ్ స్టేషన్‌కు ప్రధాన విద్యుత్తు సరఫరా కేంద్రంలోని ఒక లైన్ ఫీడర్‌కు మరమ్మతులు చేపడుతున్నట్లు ఈఈ ఆపరేషన్స్ రమణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందువల్ల మరోలైన్ ద్వారా విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు. మరమ్మతుల్లో భాగంగా ఈ నెల 13, 14 తేదిల్లో నంద్యాల పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండవచ్చని తెలిపారు. నంద్యాల జిల్లా విద్యుత్తు వినియోగదారులు గమనించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని