logo

Kurnool: రెవెన్యూ శాఖ మెరుగైన సేవలు అందించాలి

రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ జీవన్ చంద్ర శేఖర్ అన్నారు.

Published : 20 Jun 2024 18:59 IST

బేతంచర్ల: రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ జీవన్ చంద్ర శేఖర్ అన్నారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వేయర్‌ డీటీ దేవనాథ్, ఆర్ఐ శ్రీదేవి, సర్వేయర్ జ్యోస్న, వీఆర్వోల ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం పురస్కరించుకొని తహసీల్దార్ జీవన్ చంద్ర శేఖర్ కేక్ కట్ చేశారు. పరిపాలనలో రెవెన్యూ శాఖ వెన్నముక లాంటిదన్నారు. మారుతున్న కాలనుగునంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీర్వోలు శివరామయ్య, గోవిందప్ప, రఫీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని