logo

ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళకు గాయాలు

సున్నిపెంటలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ  తీవ్రంగా గాయపడింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 21 Jun 2024 14:17 IST

సున్నిపెంట సర్కిల్ : సున్నిపెంటలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ  తీవ్రంగా గాయపడింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సున్నిపెంటలోకు చెందిన పిచ్చమ్మ అనే మహిళ దుకాణాన్ని తెరిచేందుకు కాలినడకన వెళ్తోంది.  కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బస్టాండ్ సర్కిల్‌లో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిచ్చమ్మ కాళ్లకు బలంగా గాయమైంది.  గమనించిన స్థానికులు పిచ్చమ్మకు వైద్యశాలలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు రిఫర్‌ చేశారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని