logo

Kurnool: కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో సీట్లు పెంచాలి

కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రభుత్వం అదనంగా సీట్లు పెంచాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆలూరు నియోజక వర్గ కార్యదర్శి మునిస్వామి, విదార్థుల తల్లితండ్రులు డిమాండు చేశారు.

Published : 25 Jun 2024 19:14 IST

ఆస్పరి: కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రభుత్వం అదనంగా సీట్లు పెంచాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆలూరు నియోజక వర్గ కార్యదర్శి మునిస్వామి, విదార్థుల తల్లితండ్రులు డిమాండు చేశారు. మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి ధర్నా చేపట్టారు. ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన అలూరు నియోజక వర్గంలోని ఆస్పరి మండలం చిన్నసన్న కారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు సైతం పిల్లలతో కలసి వలసలు పోతుండటంతో విద్యార్థిని, విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం స్పందించి కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో సీట్లు పెంచాలని డిమాండు చేశారు. పేక్షావలి, వీరరామయ్య, గోవిందమ్మ, చెన్నమ్మ, లాలు, రాజు, శంకరప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని