logo

Kurnool: రాయితీపై విత్తనాలు అందించాలి

నంద్యాల జిల్లాలోని రైతులకు రాయితీ ధరకు మొక్క జొన్న, పత్తి, వరి విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు అన్నారు.

Updated : 12 Jun 2024 22:02 IST

రైతునగరం (నంద్యాల): నంద్యాల జిల్లాలోని రైతులకు రాయితీ ధరకు మొక్క జొన్న, పత్తి, వరి విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతం జీలుగ, పిల్లి పెసర, కందులు, వేరు సెనగ విత్తనాలు మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. వీటితో పాటు మొక్క జొన్న, వరి, పత్తి విత్తనాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు, శివరాంరెడ్డి, అంబయ్య, శేఖర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని