logo

Kurnool: నారాయణ స్వామికి ప్రత్యేక పూజలు

ఆస్పరి మండలం హాలిగేరా గ్రామ సమీపంలోని కూర్మనారాయణ క్షేత్రంలో కూర్మనారాయణ జయంతి సందర్భంగా నారాయణ స్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 18 Jun 2024 15:11 IST

ఆస్పరి: ఆస్పరి మండలం హాలిగేరా గ్రామ సమీపంలోని కూర్మనారాయణ క్షేత్రంలో కూర్మనారాయణ జయంతి సందర్భంగా నారాయణ స్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు నరేష్ ఆధ్వర్యంలో మహిళా మండలి సభ్యులచే విష్ణు సహస్ర నామ పారాయణాన్ని చేపట్టారు. అనంతరం కూర్మ నారాయణ గిరి ప్రదక్షణ భజన చేసుకుంటూ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని