logo

Kurnool: అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో మంగళవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 18 Jun 2024 16:57 IST

ఆళ్లగడ్డ గ్రామీణం: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో మంగళవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో తెల్లవారుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య ఆరాధనలు చేశారు.  ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి, సుదర్శన మూర్తిని అలంకరించి అద్దాల మండపంలో కొలువుంచారు. స్వామి అమ్మవార్లకు ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి స్వాతి సుదర్శన హోమం నిర్వహించారు. హోమం నుంచి వెలువడిన కాటుకను భక్తులు స్వీకరించి స్వామిని ఆరాధించారు. అనంతరం అర్చకులు స్వామికి మహా మంగళహారతి అందించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, మఠం ప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని