logo

Kurnool: చిప్పగిరిలో తెదేపా సంబరాలు

చంద్రబాబు సీఎం పదవి చేపట్టడంతో మండలంలోని తెదేపా నాయకులు సంబరాలు చేసుకున్నారు.

Published : 12 Jun 2024 19:14 IST

చిప్పగిరి: చంద్రబాబు సీఎం పదవి చేపట్టడంతో మండలంలోని తెదేపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. చిప్పగిరిలోని అంబేడ్కర్‌  కూడలి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు తిమ్మయ్య, కిష్టప్ప, హంపయ్య, కన్వీనర్ షేక్షావలి, భీమ లింగప్ప, ఎల్లంకి రజిని మాట్లాడుతూ.. అనుభవం గల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని