logo

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తెదేపా నేతల సంబరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆదోని పట్టణంలో తెదేపా శ్రేణులు బుధవారం సంబరాలు చేసుకున్నాయి.

Published : 12 Jun 2024 14:03 IST

ఆదోని మార్కెట్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆదోని పట్టణంలో తెదేపా శ్రేణులు బుధవారం సంబరాలు చేసుకున్నాయి. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఊరేగింపుగా తరలివచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సిద్ధార్థ నాయుడు, రంగస్వామి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబునాయుడు నాయకత్వం తప్పనిసరి అన్నారు. దీంతో ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, లింగన్న, గోపి, రాజు, ఉరుకుందు ముజీబ్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని