logo

Kurnool: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తెదేపా శ్రేణుల సంబరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, నారా లోకేష్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Updated : 12 Jun 2024 18:10 IST

బేతంచెర్ల: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, నారా లోకేష్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, నినాదాలు చేశారు. అనంతరం కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. కొత్తబస్టాండులో చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని నేరుగా చూసేందుకు ఎంపీడీవో రవి ప్రసాద్, మున్సిపల్ నగర కమిషనర్ రమేష్ బాబు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్కీన్లు ఏర్పాటు చేశారు. పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు బస్టాండులో మంత్రుల ప్రమాణస్వీకారాన్ని వీక్షించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు జాకీరుల్లాబేగ్, రవీంద్ర నాయక్, మేకల నాగరాజు, రూబెన్, అంజి, మురళీ, ఎమ్మెస్ వలి, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని