logo

పత్తికొండలో తెలుగు యువత ర్యాలీ

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పత్తికొండలో తెలుగు యువత ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

Updated : 12 Jun 2024 12:19 IST

పత్తికొండ రూరల్‌: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పత్తికొండలో తెలుగు యువత ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పత్తికొండ మార్కెట్ యార్డ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణవీధుల గుండా అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కోసి, మిఠాయిలు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని