logo

Kurnool: చిరుత దాడిలో మహిళ మృతి

నంద్యాల జిల్లా మహానంది, సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవిలో పచ్చర్ల గ్రామానికి చెందిన మహిళపై చిరుత దాడిచేసింది.

Published : 25 Jun 2024 19:12 IST

మహానంది: నంద్యాల జిల్లా మహానంది, సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవిలో పచ్చర్ల గ్రామానికి చెందిన మహిళపై చిరుత దాడిచేసింది. దీంతో ఆ మహిళ మృతి చెందింది. మంగళవారం వంట చెరుకు కోసం వెళ్లిన మహిళపై దాడి చేసిన చిరుత తలభాగాన్ని వేరు చేసింది. చిరుత నోటికి చిక్కి మహిళ కేకలు వేస్తుండగా సమీపంలోని స్థానికులు చేరుకునే లోపే ఆమెను చెట్లపొదల్లోకి లాక్కొని వెళ్లింది. ఇటీవలే గ్రామానికి చెందిన షేక్ బేబీ అనే మహిళ తన ఇంటి వద్దనే నిద్రిస్తుండగా చిరుత దాడి చేయడంతో స్వల్పగాయాలతో బయటపడింది. దీంతో అటవీ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో చిరుతను పట్టుకోవడానికి బోనును ఏర్పాటు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని