logo

Mahbubnagar: కారును ఢీ కొన్న సంఘటనపై కేసు నమోదు

వెనక నుంచి కారును లారీ ఢీ కొట్టిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

Published : 22 Jun 2024 19:51 IST

రాజోలి: వెనక నుంచి కారును లారీ ఢీ కొట్టిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. హైదరబాద్‌కు చెందిన చింతల రాజు తన భార్య, ఇద్దరు పిల్లలో కలసి తిరుపతి నుంచి జాతీయ రహదారి గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి గ్రామ శివారులో మహారాష్ట్ర నుంచి వేగంగా వస్తున్న లారీ వెనుక నుంచి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో రెండు టైర్లు పేలడంతో అక్కడే కారు నిలిచి, పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటపై లారీలో ఉన్న తేజ్, ప్రతాప్ సింగ్‌లపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని