logo

Mahbubnagar: జోగులాంబను దర్శించుకున్న చిన్నారెడ్డి

అలంపూర్లోని ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ దేవి అమ్మవారిని, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి శనివారం దర్శించుకున్నారు.

Published : 22 Jun 2024 14:58 IST

రాజోలి: అలంపూర్లోని ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ దేవి అమ్మవారిని, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు , ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారి ఆలయంలో, తర్వాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. అలాగే ఈ సంస్థ ద్వారా ఆలంపూర్ ఆలయం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని