logo

Mahbubnagar: దొంగతనాల నిరోధానికి పూర్తిస్థాయిలో నిఘా

జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస రావు అన్నారు.

Published : 22 Jun 2024 15:00 IST

రాజోలి: జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస రావు అన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తొలిసారిగా ఆయన శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జలాల దొంగతనాల నిరోధానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలోను కఠినంగా ఉంటామని, విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని