logo

Mahbubnagar: ఆలయ సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు

రాజోలి శివారులోని తుంగభద్ర నది మధ్యలో ఉన్న ప్రాచీన రామప్ప స్వామి ఆలయ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి.

Published : 22 Jun 2024 16:50 IST

రాజోలి: రాజోలి శివారులోని తుంగభద్ర నది మధ్యలో ఉన్న ప్రాచీన రామప్ప స్వామి ఆలయ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. ఇక్కడ జనజీవనం లేకపోవడంతో కొందరు వ్యక్తులు నది దాటి వెళ్లి ఆలయం ముందు రెండు చోట్ల నిధుల కోసం తవ్వకాలు జరిపారు. తవ్వకాలకు ముందు పరిసరాల్లో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. శనివారం ఉదయం పూజలు చేసేందుకు వెళ్లిన పూజారి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లుగా గుర్తించారు. గతంలోనూ చాలా సార్లు తవ్వకాలు జరిపి ఆలయాన్ని శిథిలం చేశారని, ప్రస్తుతం దాతల సహకారంతో దేవాలయం బాగు చేసినట్లుగా పూజారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని